యాలాల ఎస్‌హెచ్ఓగా విఠల్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

యాలాల ఎస్‌హెచ్ఓగా విఠల్ రెడ్డి
– మరోసారి మండల ఎస్ఐగా బాధ్యతలు
kvcs

తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండల పోలీస్టేషన్ ఎస్‌హెచ్ఓగా విఠల్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయన పోలీస్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ గిరిని బదిలీ చేశారు. దీంతో ఆయన స్థానంలో ఎస్‌హెచ్ఓగా విఠల్ రెడ్డిని నియమించారు.

బాధ్యతలు స్వీకరించిన విఠల్ రెడ్డి గతంలో ఇదే పోలీస్టేషన్ లో ఎస్ఐగా పనిచేశారు. తాజాగా ఆయన మరోసారి యాలాల ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే ఇదే పోలీస్టేషన్ లో ఎస్ఐ2గా విఠల్ కొనసాగుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ విఠల్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తాననని అన్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్ వల్లే రైతులకు దుర్గతి..!