భద్రేశ్వర జాతర బ్రహ్మండంగా నిర్వహిస్తాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వర జాతర బ్రహ్మండంగా నిర్వహిస్తాం..!
– జాతర ఉత్సవ కమిటి అధ్యక్షులు మేడి మహేష్‌ కుమార్
– దేవాలయంలో అధ్యక్షులు, సభ్యుల బాధ్యతల స్వీకరణ
– సన్మానించిన సంఘం పెద్దలు, యువకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ప్రసిద్ది చెందిన భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని దేవాలయ జాతర ఉత్సవ కమిటి అధ్యక్షులు మేడి మహేష్‌ కుమార్ అన్నారు.

జాతర ఉత్సవ కమిటి అధ్యక్షులుగా నియామకమైన మేడి మహేష్‌, సభ్యులు సోమవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటి అధ్యక్షులుగా మేడి మహేష్‌ కుమార్, డైరెక్టర్లుగా దేవనూరు శంకర్, అగ్గనూరు సాకేత్, గాజుల విజయ్ కుమార్, గంగా శ్రావణ్ కుమార్, శెట్టి చంద్రకాంత్, కోర్వార్ అంజలి బాధ్యతలను చేపట్టారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు మేడి మహేష్‌ కుమార్ మాట్లాడుతూ వచ్చే భద్రేశ్వర జాతర ఉత్సవాలను బ్రహ్మండంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని విధాల ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తామన్నారు. ప్రతి యేడాది మాదిరిగానే దేవాలయ జాతర ఉత్సవాలను సంప్రదాయ బద్దంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డిలతో పాటు తాండూరు ప్రముఖులు, సంఘం సభ్యుల సహాకారంతో ముందుకు సాగుతామని అన్నారు. అనంతరం వీరశైవ సమాజం, వీరశైవ యువదళ్ సంఘాల సభ్యులు, పలువురు అభిమానులు జాతర ఉత్సవ కమిటి అధ్యక్షులు, డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు.

మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి

శభాష్‌.. దివిటి ఎల్లప్ప..!