బండిసంజయ్‌కి జై కొట్టిన పటేల్ జయశ్రీ

తాండూరు రాజకీయం వికారాబాద్

బండిసంజయ్‌కి జై కొట్టిన పటేల్ జయశ్రీ
– ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో స‌న్మానం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజ‌య్‌కు తాండూరుకు చెందిన ఆ పార్టీ రాష్ట్ర నాయకురాలు పటేల్ జయశ్రీ జై కొట్టారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శించుకున్న అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో పటేల్ జయశ్రీ పాల్గొని బండి సంజ‌య్‌ను శాలువాతో సన్మానించారు. యాత్ర‌లో బండి సంజ‌య్‌తో క‌లిసి ప‌ర్య‌టించి జై కోడుతూ బీజేపీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ యాత్రలో నాయకులు మధు మోదీ, తాండ్ర నరేష్, శ్రీశైలం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.