నమో దుర్గామాత..!
– అమ్మవారిని దర్శించుకున్న మనోహరన్న
– బసవన్న కట్ట వద్ద ఎమ్మెల్యే పూజలు
– రూ. 1లక్ష విరాళం
తాండూరు, దర్శిని ప్రతినిధి : నమో దుర్గామాత అంటూ.. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అమ్మవారిని వేడుకున్నారు. పట్టణంలోని బసవన్న కట్ట వద్ద నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

శనివారం ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బసవన్న కట్ట వద్ద ప్రతిష్టించిన భవాని మాతను దర్శించుకున్నారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

అదేవిధంగా నిర్వహణ కమిటీకి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రూ. 1లక్ష విరాళం అందించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరికీ నవరాత్రి ఉత్సవాలు, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ నవరాత్రి ఉత్సవాలను, దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, కౌన్సిలర్లు జంటిపల్లి వెంకట్, దివిటీ ఎల్లప్ప, పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు, నాయకులు వడ్డే శ్రీనివాస్, రాము, నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.


