కోటిపల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్‌పర్సన్‌కు ఘన సన్మానం

తాండూరు రాజకీయం వికారాబాద్

కోటిపల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్‌పర్సన్‌కు ఘన సన్మానం
– భవానీనగర్‌ వాసుల ఆధ్వర్యంలో అభినందనలు

– పాల్గొన్న 10వ వార్డు కౌన్సిలర్‌ శ్రీకాంత్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి: కోటిపల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్‌పర్సన్‌గా నూతనంగా నియమితులైన మదలత శ్రీనివాస్‌ చారిని తాండూరు పట్టణంలోని భవానీనగర్‌ కాలనీవాసులు ఘనంగా సన్మానించారు.

శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్‌ అల్లాపూర్‌ శ్రీకాంత్‌, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు నర్సిరెడ్డితో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్‌పర్సన్‌గా శ్రీనివాస్‌ చారి నియమితులు కావడం తమ ప్రాంతానికి గర్వకారణమని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. నూతన బాధ్యతల్లో ఆయన విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన పలువురు ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.

Pvr

భవానీ మాతను దర్శించుకున్న శంకర్‌ యాదవ్‌