ప‌క్కాగా ప‌ల్స్ పోలియో..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ప‌క్కాగా ప‌ల్స్ పోలియో..!
– చుక్క‌ల మందు పంపిణీకి సిద్దం కండి
– 0-5 ఏండ్ల లోపువారంద‌రికి వేయాలి
– వికారాబాద్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ మోతిలాల్
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: పోలియో మహ‌మ్మారిని త‌రిమేసేందుకు ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని ప‌క్కాగా చేప‌ట్టాల‌ని వికారాబాద్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ మోతిలాల్ పేర్కొన్నారు. ఈనెల 27 నుంచి ప్రారంభించ‌నున్న ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వైద్య అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటితో అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27, 28వ తేదిల‌తో పాటు వ‌చ్చేనెల మార్చి 1వ తేదిలలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో, అర్బన్ ప్రాంతాల్లో, మున్సిపాలిటీలో 60 లియో బూత్ లు ఏర్పాటు చేసి అర్హత గల పిల్లలందరికీ పోలియో చుక్కలు చేసేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో గుర్తించిన 0-5 వయసు గల 93,232 మంది పిల్లలకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేసే విధంగా DEO, DPO, DWO అధికారులు వైద్య సిబ్బందికి పూర్తి సహకారం అందించాల‌న్నారు. ప్రతి ఒక్కరు పల్స్ పోలియో చుక్కలు వేసుకొనేలా ప్రచారం చేయాలని అన్నారు. ఆదివారం ఉన్నందున సంబంధిత అధికారులు పోలియో బూత్ ముందుగానే సిద్దం చేసుకొని బూత్ లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ, బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర రెడ్డి ప్రాంతాలలో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ లను ఏర్పాటు చేసి బూత్ వివరాలు, తేదీ, సమయం అన్ని వివరాలను తెలియపరచాలని అన్నారు. పోలియో చుక్కలు వేయించుకొని చిన్నారులకు ఈ నెల 285 మరియు మార్చి, 1వ తేదీన ఏఎన్ఎంలు, ఆశ‌ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి పోలియో చుక్కలు వేయాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలలో ఉన్న ఐదేలల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. జిల్లాలో ఆర్హత గల చిన్నారులందరికీ. పోలియో చుక్కలు వేయించి, పల్స్ పోలియో కార్యమాన్ని విజయవంతానికి అధికారులు స‌హ‌క‌రించాల‌న్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యా అధికారి తుకారం, డిప్యూటీ డియంహెచ్ జీవరాణి, డీఈఓ రేణుకా దేవి, డీపీఓ మల్లారె