గొంతెత్తిన గొల్ల కురుమలు
– గొర్రెల పంపిణీ చేయాలంటూ ఆందోళన
– తాండూరు ఆర్డీఓకు వినతి పత్రం అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని గొల్ల కురమలు గొంతెత్తారు. గొర్రెల పంపిణీ చేయాలని డిమాండు చేశారు. మంగళవారం తాండూరు నియోజకవర్గ శ్రీ మల్లికార్జున ప్రాథమిక గొర్రెల, మేకల సహాకార సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మూడు నెలల క్రితం ఓక్కో సభ్యుడు రూ.43 వేల 750లను ప్రభుత్వానికి డీడీ కట్టడం జరిగిందని అన్నారు. ఇప్పటికు గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ చేయలేదన్నారు. అప్పు తెచ్చి కట్టిన డబ్బులకు వడ్డీ పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. వెంటనే గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేయాలని డిమాండు చేశారు. గొల్ల కురుమమల సమస్యపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్, ఎంపీలు స్పందించాలన్నారు.
గొల్ల కురుమలకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాస్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గొల్ల కురుమల నేతలు గౌరి వెంకటేశం, జినుగుర్తి నర్సింలు, పల్లె వెంకటయ్య, అన్నమయ్య, పూజారి పాండు, ఇందూరు మల్లేశం, నాగులపల్లి నర్సింలు, శివప్ప, అల్లాపూర్ శ్రీనివాస్, గొట్లపల్లి శేఖర్, సర్పంచు సాయిలు, ఎంపీటీసీ శాంతు, జి. మల్లేశం, ఆగ్గనూర్ గుండప్ప, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

