య‌వ్వనాన్ని పెంచే జామా..!

ఆరోగ్యం తాండూరు తెలంగాణ లైఫ్-స్టైల్

జామ‌.. ఆరోగ్య ధీమా..!
– యవ్వ‌న చ‌ర్మానికి దోహ‌దం
– రోగాల నియంత్ర‌ణ‌కు దివ్య ఔష‌దం
ద‌ర్శిని డెస్క్: సీజ‌న్ల వారిగా ప్ర‌కృతి నుంచి ల‌భించే పండ్ల నుంచి మ‌నిషి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. దాదాపు అన్ని సీజ‌న్ల‌లోని పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అందులోని పోషకాలు మాన‌వ శ‌రీరానికి మేలుచేస్తాయి. ఈ శీతాకాలం లభించే పండ్లలో జామకాయ ఒకటి.
జామ పండుగానే కాకుండ ప్రతీ అంశంలో జామ చెట్టు మనకు అనేక ప్రయోజనాలని అందిస్తుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. ఈ సీజన్‌లో ప్రతి ఒక్కరు జామకాయ తినాలి. ఇందులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.

జామపండులో విటమిన్ సి, లైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మం ఎక్స్‌ పోలియేట్‌ కాకుండా కాపాడుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా చేస్తుంది. ముడతలు పడిన చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహాయపడుతుంది.

ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు దివ్య ఔష‌దం
జామ ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు దివ్య ఔష‌దంలా ప‌నిచేస్తుంది. మధుమేహం ఉన్నవారికి జామ ఒక దివ్య ఔషధంగా చెప్పవచ్చు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో బరువును నియంత్రించడంలో జామకాయ సహయపడుతుంది.
అలాగే పండును తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇతర పండ్ల కంటే ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీంతో జీర్ణక్రియపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. జామ గింజలు గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. చిగుళ్లు, దంత సమస్యలతో బాధపడే వారు తరచూ జామకాయలు తింటే ఆ సమస్యల్ని దూరం చేసుకున్న వారవుతారు. రోజూ రెండు, మూడు లేత జామ ఆకులు నమిలితే నోటి దుర్వాసన తగ్గిపోతుంది. జామ తినడం వల్ల క్షయ, ఉబ్బసం, బ్రాంకైటీస్‌, గుండె బలహీనత, కామెర్లు, హెపటైటిస్‌, జీర్ణాశయపు అల్సర్లు, మూత్రంలో మంట వంటి సమస్యలు దూరం అవుతాయి. కాలిన గాయాలతో బాధపడే వారు గుజ్జును ఆ ప్రాంతంలో రాయడం వల్ల ఉపశమనం పొందుతారు.

రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంపు
జామ మాన‌వ శ‌రీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జామకాయలో యాంటీ ఏజింగ్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. జామలో ఉండే అనేక యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి.
జామ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. శక్తిని కూడా ఇస్తుంది. అదేవిధంగా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో జామపండు సహాయపడుతుంది. కానీ సీజన్ మారినప్పుడు రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. రోజుకో జామపండు తినడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.