ఇదేం నిర్లక్ష్యం సార్..!
– నాటేందుకు తెచ్చిన మొక్కలపై ఆశ్రద్ద
– పెట్టిన చోటే మోడువారుతున్న వైనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణ సాద్యమయ్యే వనాలపై తాండూరు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌కు నిధులు వెచ్చించి మరీ మొక్కలు తీసుకవచ్చారు.

ఈ మొక్కలను మున్సిపల్ కార్యాలయ వెనుభాగంలో ఉంచారు. తీసుకవచ్చిన నాటి నుంచి కొన్ని మొక్కలను మాత్రమే అక్కడక్కడా మొక్కుబడిగా నాటారు. మిగతా మొక్కలను అలాగే వదిలేశారు. ప్రస్తుతం ఉన్న చోటే మొక్కలు మోడువారిపోతున్నాయి. పట్టణంలో పార్కులు, ప్రకృతి వనాలు ఖాళీగా ఉన్నప్పటికి వాటిలో ఈ మొక్కలను నాటేందుకు శ్రద్ద చూపించడం లేదు.

తీసుకవచ్చిన చోటే మొక్కలను వదిలేయడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు కూడా చర్యలు తీసుకోవడం అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా ఎండిన మొక్కలు నిలుస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇదేం నిర్లక్ష్యం సార్ అంటూ పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడీ మొక్కలు నాటుతారా.. అలాగే వదిలేస్తారా అనేది వేచిచూడాలి.

ఇదికూడా చదవండి…

