క్రిస్మస్ పండగను సంతోషంగా జరుపుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: క్రైస్తవుల పర్వదినం క్రిస్మన్‌ను అందరు కుల మతాలకు అతీతంగా సంతోషంగా జరుపుకోవాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తాండూరు పట్టణం ఎన్టీఆర్ నగర్లో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని క్రైస్తవ సోదరులతో కలిసి క్రిస్మస్ కేకును కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వారికి తినిపించి క్రిస్మస్ పండగ శుభాకాంక్షలను తెలిపారు. అదేవిధంగా క్రైస్తవులు ఎమ్మెల్యేకు కేక్‌ను తినిపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఏసు క్రీస్తు జననం క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన దినమన్నారు. లోకాని రక్షించేందుకు వచ్చిన ఏసు మార్గాన్ని అనుసరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, రంజాన్ పండగలతో పాటు క్రిస్మస్ పండగకు కేసీఆర్ సర్కారు సమ ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. పండగకు ముందు కొత్త దుస్తులు అందించి.. విందును అందిస్తోందని అన్నారు. ప్రజలంతా క్రిస్మస్ పండగను కుల మతాలకు అతీతంగా సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పట్లోళ్ల నర్సింలు, పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), అంతారం గ్రామ సర్పంచ్ రాములు, టీఆర్ఎస్ నాయకులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

