ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్

ఆరోగ్యం జాతీయం హైదరాబాద్

ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్
– త‌క్కువ ధ‌రతోనే ప‌రీక్ష
– ఆమోదించిన ఐసీఎంఆర్
ద‌ర్శిని డెస్క్ : క‌రోనా సోకిన వారు ఇంట్లోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకునే కిట్లు గ‌తంలోనే అందుబాటులోకి వ‌చ్చాయి. క‌రోనా కొత్త రూపాంత‌రం చెంది ఒమిక్రాన్‌గా వ‌చ్చింది. తాజాగా ఒమిక్రాన్ ను గుర్తించేందుకు ప్ర‌త్యేక కిట్ అందుబాటులోకి రాబోతుంది. ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించడానికి టాటా సంస్థ ఓ కిట్ ను రూపొందించింది. ఒమిషూర్ పేరుతో రూపొందించిన ఈ కిట్ కు ICMR ఆమోదం తెలిపింది. టాటామెడికల్ , ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో కొత్త కరోనావైరస్ వేరియంట్ Omicron ను గుర్తించడానికి RT-PCR టెస్ట్ కిట్‌ను భారతదేశంలో అభివృద్ధి చేసినట్లు ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. రూ. 250ల ధ‌ర‌తో ఉండే ఈ కిట్ పరీక్షించిన నాలుగు గంటల్లో ఫలితాలను వెల్ల‌డిస్తుంద‌ని డాక్టర్ భార్గవ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్లతో పోల్చుకుంటే ఒమిషూర్ ధర తక్కువగా ఉంది. నేడో, రేపో ఈ టెస్ట్ కిట్ మార్కెట్లో అందుబాటులో కి రానుంది.