మంత్రాల‌యంలో మ‌హేంద‌ర్ రెడ్డి కోసం పూజ‌లు

తాండూరు వికారాబాద్

మంత్రాల‌యంలో మ‌హేంద‌ర్ రెడ్డి కోసం పూజ‌లు
– త్వ‌ర‌గా కోలుకోవాల‌ని వేడుకున్న నాయ‌కులు
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : క‌రోనా బారిన ప‌డిన ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఊరూ వాడ దేవ‌తా మూర్తుల‌కు జోరుగా పూజ‌లు నిర్వ‌హించారు. కేవ‌లం తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా సుధూర ప్రాంతాల‌కు వెళ్లి దైవాల‌ను ప్రార్థిస్తున్నారు. తాండూరు మండ‌లంలోని చెంగోల్ గ్రామ యువ‌జ‌న సంఘం నాయ‌కులు మంగ‌ళ‌వారం తిరుప‌తి తిరుమ‌ల వేంక‌టేశ్వరున్ని ద‌ర్శించుకుని మ‌హేందర్ రెడ్డి కోసం పూజ‌లు చేశారు. బుధ‌వారం అక్కడి నుంచి బ‌య‌ల్దేరి మంత్రాల‌యానికి చేరుకున్నారు. అక్క‌డ వెల‌సిన శ్రీ రాఘ‌వేంద్ర స్వామి ద‌ర్శించుకుని ఎమ్మెల్సీ మ‌హేందర్ రెడ్డి త్వ‌ర‌గా కోలుకునేలా చూడాల‌ని, సంపూర్ణ ఆరోగ్యంతో ప్ర‌జాసేవ‌కు త‌ర‌లిరావాల‌ని కాంక్షిస్తూ వేడుకున్నారు. ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి కోసం పూజ‌లు చేసిన వారిలో యువజన సంఘం అధ్యక్షులు, ఎంపీటీసీ రాము, లక్ష్మీ కాంత్ రెడ్డి, లక్ష్మణ్, నరేష్, రవి, పోచయ్య, ప్రవీణ్, బాలరాజు, నరేష్ త‌దిత‌రులు ఉన్నారు.