అయ్య‌ప్ప ఆల‌య అభివృద్ధికి ఎమ్మెల్యే చేయూత

తాండూరు వికారాబాద్

అయ్య‌ప్ప ఆల‌య అభివృద్ధికి ఎమ్మెల్యే చేయూత
– స్వామి వారి విగ్ర‌హం, కిరీటానికి బంగారం, వెండి స‌మ‌ర్పణ
– తాత‌గారి స్మార‌కార్థం దుకాణాల స‌ముదాయానికి భూమి పూజ‌
బ‌షీరాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: బషీరాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి త‌న వంతు చేయూనందించేందుకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ముందుకొచ్చారు.
మంగ‌ళ‌వారం ఆల‌య నిర్మాణాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయ‌ణ‌రావు, టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు పి.శ్రీ‌శైల్‌రెడ్డిల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు తన తాత గారైన కీర్తిశేషులు లింగా రెడ్డి గారి జ్ఞాపకార్థం తన సొంత ఖర్చులతో 8 దుకాణ సముదాయాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీశైల్ రెడ్డి, నాయకులతో కలిసి
నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. అదేవిధంగా పంచలోహాలతో తయారు చేయనున్న అయ్యప్ప స్వామి విగ్రహంతో పాటు స్వామి వారి కిరీటానికి తన వంతు సహాయంగా వెండి, బంగారాన్ని సమర్పించారు.