తాండూరు నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!
– ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు
– భర్తికి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
– అర్హుతలు, గడువు తేది వివరాలు ఇవే..
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలోని నిరుద్యోగులకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి గుడ్‌ న్యూస్ వచ్చింది. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్(అతిథి అధ్యాపకులు) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపల్ డా.ఏ. వసంత కుమారి తెలిపారు.

2025-26 విద్యా సంవత్సరానికి గాను ఈ పోస్టులను భర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఇంగ్లీష్-2, తెలుగు-2, వాణిజ్య శాస్త్రం-2 (ఇంగ్లీష్ మీడియం), 1(ఉర్దూ మీడియం), రాజకీయ శాస్త్రం-1, గణిత శాస్త్రం-1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్-2, హిందీ-1, జంతుశాస్త్రం-1, వృక్షశాస్త్రం-1, ఉర్దూ-1 పోస్టులకు దరఖాస్తులను కోరడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో 55శాతం మార్కులుతో పోస్ట్ గ్రాడ్యూయేషన్ చేసి ఉండాలి, ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు కనీస అర్హతగా 50శాతం మార్కులు ఉండాలన్నారు.

అదేవిధంగా పీహెచ్ డీ/నెట్/సెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది, సంబంధిత సబ్జెక్టులలో బోధన అనుభవం ఉండాలన్నారు. బోధన అనుభవం ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా సర్వీస్ సర్టిఫికెట్లు సమర్పించాలన్నారు. అసక్తిగల అభ్యర్థులు ఈనెల 23వ తేది సాయంత్రం 4గంటల్లోపు కాలేజీలో దరఖాస్తులను సమర్పించాలని, పూర్తి వివరాలకు కాలేజీలో సంప్రదించాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

మహిమాన్వితం శివపార్వతుల లీలలు