నేతాజీ ఆశయాలను నెరవేర్చాలి
– చెంగోల్‌లో సుభాస్ చంద్రబోస్ జయంతి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని తాండూరు మండలం కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్, చెంగోల్ గ్రామ సర్పంచ్ మల్లీశ్వరీగౌడ్, ఎంపీటీసీ గౌడీ రత్నమాల రాములు పేర్కొన్నారు. ఆదివారం గ్రామానికి చెందిన స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నేతాజీ సుభాస్ చంద్రబోస్ చిత్రపటానికి ఎస్ఐ మధుసూదన్, చెంగోల్ గ్రామ సర్పంచ్ మల్లీశ్వరీగౌడ్, ఎంపీటీసీ గౌడి రత్నమాల రాములతో పాటు యువకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం సుభాష్ చంద్రబోస్ ఎంతో కృషి చేశారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన ఆజాద్ హిందూ పౌజ్ ను స్థాపించారని అన్నారు. నేతాజీ ఆశయాలను నెరవేర్చుందకు అందరు ముందుండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ లక్ష్మణ్, కృష్ణయ్య, లక్ష్మీ కాంత్ రెడ్డి, విజయ్, శేఖర్, ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


