పాన్‌కార్డు ఉంటేనే ఫోస్టాఫీసులో ఖాతా
– అనుసంధానం లేకపోయిన సేవలు బంద్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: పో్స్టాఫీసులో ఖాతా తెరువాలనేకు వినియోగదారులకు కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. ఈ నిబంధనలను తప్పక పాటించాలని సూచిస్తుంది. పోస్టాఫీసు కస్టమర్లు అకౌంట్ కావాలంటే పాన్ కార్డు ఉండటం తప్పనిసరి చేసింది. అకౌంట్‌తో పాన్ కార్డును తప్పకుండా అనుసంధానం చేసుకోవాలని స్పష్టం చేస్తుంది. ఇలా చేయని పక్షంలో అకౌంట్ ఉన్నా.. నిలిపివేయడం జరుగుతుందని తెలిపింది. పాన్ కార్డు నెంబర్‌తో పాటు ఫామ్ 60 కూడ తప్పనిసరిని తెలిపింది. పాన్‌కార్డు, ఫామ్ 60 లేకపోతే ఖాతా ఓపెనింగ్ సేవలు పొందలేరని పోస్టల్ శాఖ తెలిపింది. సేవింగ్స్ ప్రమోషన్ నిబంధనలు 2018లోని రూల్ 6 ప్రకారం.. పోస్టాఫీసుల్లో అకౌంట్ తీయాలంటే పాన్ నెంబర్ ఉండటం తప్పనిసరి. మీరు ఫామ్ 60 సమర్పించినట్లయితే ఆ తర్వాత కూడా పాన్ నెంబర్ తప్పనిసిగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇందు కోసం ఆరు నెలల పాటు గడువు ఇస్తున్నట్లు తెలిపింది.
పాన్ నెంబర్ తప్పుగా ఉంటే..
అయితే వినియోగదారుడు సమర్పించిన పాన్ నెంబర్ సరైనదోకాదో అని ఎన్ఎస్డీఎల్తో ఆన్లైన్ వెరిఫికేషన్ చేస్తామని తెలిపింది. ఒక వేళ మీరు సమర్పించే పాన్ నెంబర్ తప్పుగా ఉన్నట్లయితే టీడీఎస్ రిటర్న్‌తో ఇబ్బందులు ఎదురవుతాయని డిపార్ట్మెంట్ పోస్ట్ వెల్లడించింది. అయితే పాన్‌కార్డు నెంబర్ తప్పుగా ఉండటం కారణంగా టీడీఎస్ రిటర్న్‌లు దాఖలు సమయంలో ఆదాయపు పన్నుస్టేట్ మెంట్లలో చాలా పాన్ నెంబర్లను అంగీకరించడం లేదని, దీని వల్ల డిపాజిట్ దారుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయని పోస్టల్ శాఖ తెలిపింది.

