శుద్దినీటితో శుభప్రద్ యువసేన సేవ

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

శుద్దినీటితో శుభప్రద్ యువసేన సేవ
– జుంటుపల్లిలో ఇంటింటికి మినరల్‌ వాటర్ పంపిణీ
– సమస్య తీరేంత వరకు సరఫరా
తాండూరు, దర్శిని ప్రతినిధి: యాలాల మండలం జుంటుపల్లిలో తెలంగాణ బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్‌ పటేల్ శుభప్రద్ యువసేన సభ్యులు శుద్దినీటిని సరఫరా చేశారు. గ్రామంలో పలువురు అస్వస్థతకు గురై అనారోగ్యం పాలయ్యారు. ఇందుకు కలుషిత నీరు కారణమని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శుభప్రద్ యువసేన సభ్యులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డితో కలిసి యువసేన సభ్యులు ఇంటింటికి ప్యూరీశైడ్ ఫిల్టర్ వాటర్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులకు శుద్దినీటిని పంపిణీ చేయడం పట్ల అభినందనలు తెలిపారు. మరోవైపు యువసేన సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్య తీరేంత వరకు శుద్దినీటిని సరఫరా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు భాను, ప్రకాష్, హరీష్, శాంతప్ప, విజయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.