వ‌చ్చేనెల‌లో రాజీవ్ స్వ‌గృహ ఇండ్ల వేలం

తాండూరు వికారాబాద్

ఉన్న‌వి 72 వేళానికి 17
– రాజీవ్ స్వగృహా ఇండ్ల వేలం
– వేలం ధ‌ర నిర్ణ‌యించిన అధికారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ స్వగృహ ఇండ్ల వేలం ప్రక్రియ ముందడుగు పడింది. వచ్చేనెలలో ఇండ్లను వేలం వేసేందుకు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండ్ల వేలం ప్రభుత్వ ధరలను కూడ నిర్ణయించారు. ప్రభుత్వ ఆధాయాన్ని పెంచుకునేందుకు రాజీవ్ స్వగృహ ఇండ్లను వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం కోకట్ గ్రామ సమీపంలో 72 ఇండ్లు వేలానికి ఉన్నాయి. అయితే అధికారులు ఇందులో 17 ఇండ్లను మాత్రమే వేలం వేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు. చదరపు గజానికి రూ.10 వేల చొప్పున ధరను కూడ నిర్ధారించారు.
ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే వేలానికి ప్రత్యేక సైట్‌ను https://vikarabad.telangana.gov.inను కూడ ప్రకటించారు. వచ్చే నెల మార్చి 14, 15, 16, 17వ తేదిలలో ఆన్‌లైన్‌ వేలం నిర్వహించాలని ప్రకటించారు. ఇందులో వికారాబాద్ జిల్లా తాండూరుకు సంబంధించి స్పష్టమైన తేదిపై స్పష్టత రాలేదు. దీనిపై జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోవచ్చు. పూర్తి వివరాలకు 040-2418461 కు సంప్ర‌దించవ‌చ్చు.