నకీలీ యాప్‌లతో జాగ్రత్త..!
– లోన్ తీసుకుంటే మోసపోయినట్లే
– వ్యక్తిగత సమాచారమంతా తస్కరిస్తారు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఐపీఏస్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: జిల్లా ప్రజలు నకిలీ, మోసపూరిత లోన్ యాప్‌లతో జాగ్రతగా వుండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్. కోటి రెడ్డి ఐపీఎస్ సూచించారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఈమద్యకాలంలో తరచుగా ప్రజలు నకిలీ లోన్ యాప్‌ల ద్వారా మోసపోవడం, బలవన్మరణాలకు పాల్పడున్న సంఘటనలను గుర్తుచేశారు. ప్రజలు తమ ఫోన్ లలో వచ్చే (ప్రైవేట్) నకిలీ లోన్ యాప్ మెసేజ్ లకు స్పందించవద్దని, కాల్స్ ద్వారా మోసపూరిత మాటలను నమ్మవద్దని సూచించారు. ఆన్‌లైన్లై యాప్స్ ద్వారా లోన్ తీసుకొని ఫోన్ నెంబర్ మార్చి లోన్ కట్టకుండా వుండవచ్చు అనే అపోహలో ఉంటే పొరపడినట్లే అని అన్నారు. వారు మీ యొక్క ఫోన్ లో విలువిన సమాచారం మీకు తెలియకుండానే సేకరించి.. నకిలీ లోన్ ఆప్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొన్న వారి యొక్క్ ఫోన్ లో కాంటాక్ట్స్ (సమాచారం) తస్కరిస్తారన్నారు. లోన్ తీసుకునే సమయంలోనే చెప్పిన వడ్డీ మరియు వసూలు చేసే సమయంలో వడ్డీ రేట్లు ఎక్కువ చేసి చూపిస్తారని అన్నారు. లోన్ యాప్ వాళ్ళు చెప్పన వడ్డీ రేట్లతో ప్రజలు లోన్ కట్టనట్లైతే వాళ్ళు మీ యొక్క ఫోన్ లో సేకరించిన సమాచారం ఆధారంగా మీ ఫోటో లను అసభ్యంగా మార్చి మీకు పరిచయస్తులకు పంపి భయబ్రాంతులకు గురిచేస్తారని హెచ్చరించారు. ఇలాంటి సందర్బాల్లో లోన్ తీసుకున్న వాళ్ళు ఎం చెయ్యాలో అర్థం కాక లోన్ కట్టడం కోసం వారి యొక్క ఇళ్లలోనే లేదా బయట ఎక్కడిన దొంగతహల్నలకు పాల్పడే అవకాశం ఉందని, ఇంకా కొందరు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం కూడా ఉందన్నారు. కావున ప్రజలు ఈ లోన్ అప్ప్ లతో జాగ్రత్తగా వుండాలి సూచించారు. ఇలాంటి నకిలీ లోన్ యాప్ ల గురించి ఏదైన అనుమానం వచ్చిన లేదా మోసపోయిన వెంటనే పోలీసు లకు సమాచారం అందించాలని తెలిపారు.

