తాండూరు, ధారూర్ పోలీస్టేషన్లకు అరుదైన గౌరవం
– జిల్లాలో ఉత్తమ పోలీస్టేషన్లుగా ఎంపిక
– అభినందించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
వికారాబాద్/తాండూరు : వికారాబాద్ జిల్లాలోని తాండూరు, ధారూర్, బషీరాబాద్ పోలీస్టేషన్లకు అరుదైన గౌరవం లభించింది. జిల్లాలోని మొదటి ఉత్తమ పోలీస్టేషన్లుగా తాండూరు, ధారూర్ నిలవగా బషీరాబాద్ పోలీస్టేషన్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి జిల్లాల వారిగా ప్రకటించిన జాబితాలో వికారాబాద్ జిల్లాకు సంబంధించి తాండూరు, ధారూర్ పోలీస్టేషన్లు నెంబర్ పోలీస్టేషన్లుగా గుర్తింపు సాధించాయి. ఆయా పోలీస్టేషన్ల పరిధిలలో 200 కన్నా తక్కువ గల క్రైమ్‌లో ధారూర్ పోలీస్టేషన్ మొదటి స్థానం, రెండో స్థానం లో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎంపికకాబడింది. 200 కన్నా ఎక్కువ క్రైమ్ ఉన్న విభాగంలో తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. దీంతో పాటు తాండూరు పట్టణ పోలీస్టేసన్ క్రైమ్ ప్రేవేన్షన్ అండ్ డిటెన్సన్, ఇవ్నెస్టిగేషన్, పోయాక్టివ్ పోలిసింగ్, కమ్యూనిటి పోలిసింగ్, ఫ్రెండ్లీ పోలిసింగ్, 5S లలో ఉత్తమ ప్రతిభ కనబర్చి అవార్డును దక్కించుకుంది. ఉత్తమ పోలీస్టేషన్లుగా గుర్తింపు సాధించిన పోలీస్టేషన్‌ల సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అభినందించారు.
ఉత్తమ సేవలను కొనసాగిస్తాం : తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
————————————————————————-
వికారాబాద్ జిల్లాలో తాండూరు పట్టణ పోలీస్టేషన్ ఉత్తమ పోలీస్టేసన్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది.
ఈ స్పూర్తితో తాండూరు పోలీస్టేషన్‌లో సేవలను మరింత మెరుగు పరచడంతో బాధ్యత పెరిగింది. ఇందుకు అనుగుణంగా పోలీస్టేషన్‌లో అన్ని విభాగాలను గుణాత్మకంగా తీర్చిదిద్దుతాం. ఫిర్యాదు దారుల పట్ల స్నేహపూరకంగా మెగిలి ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మెరుగు పరుస్తాం. కమ్యూనిటీ పోలీసింగ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరుస్తాం. అన్ని విభాగాలలో ఉత్తమ సేవలను కొనసాగిస్తాం.

