ఖబడ్దార్.. హెచ్చరిస్తున్నా..!
– బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులకు భయపడం
– కాంగ్రెస్ నేతల అరాచకాలు మితిమీరుతున్నాయ్
– తాండూరు ఎమ్మెల్యేకు సవాల్ విసిరినా రోహిత్ రెడ్డి
– ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతలపై పైలెట్ ఫైర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : అరాచకాలకు దిగితే.. ఖబడ్దార్.. కాంగ్రెస్ నేతల్లారా.. అంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆరాచక రాజకీయాలకు పాల్పడతోందని మండిపడ్డారు. పంచాయతీ ఎమ్మెల్యే అనుచరులు ఎన్నికల్లో దౌర్జన్యాలకు, రౌడీయిజాలు చేస్తూ దిగజారిపోతున్నారని విమర్శించారు.

మంగళవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులు లేకుండా.. పార్టీలకతీతంగా జరుగుతున్నాయని ఆన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కనివిని ఎరుగని రీతిలో అరాచాకాలు మితిమీరి పోతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే అనుచరులు రౌడియిజం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ మద్దతు దారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సపోర్టు చేయకపోతే సంగతి చూస్తామని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. లక్ష్మీనారాయణపూర్, మంతన్ గౌడ్ సర్పంచులను హడావుడిగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. బలం నిరూపించుకోవాలంటే తాండూరు అభివృద్ధిలో చూపించాలని అన్నారు. తాండూరు ఎమ్మెల్యేకు ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని, గ్రామాల పేర్లు కూడా ఆయనకు తెలియదని విమర్శించారు.

తాండూరును ఆగం పట్టిస్తున్నారని అన్నారు. నమ్మి ఓటేస్తే.. అరాచక పాలన తీసుకవచ్చారని అన్నారు. వచ్చే మూడేళ్లలో అయినా కనీసం 10శాతం అభివృద్ధి అయినా చేసి చూపించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి.. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. పార్టీ పరంగా అయినా ఎంత శాతం ప్రాధాన్యత ఇచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. మీడియాపై కూడా కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలు జరుగుతున్నాయని తమ దృష్టికి పచ్చిందన్నారు. ఇదెక్కడి సంస్కృతిని అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, బషీరాబాద్ మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన జాగీరు రాములుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ప్రేమ్ సింగ్, రమేష్, సంజీవ్ లు బెదిరింపులకు పాల్పడి.. దాడికి యత్నించారని అన్నారు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. పంచాయతీ ఎన్నికలలో గెలుపు, ఓటములను ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. బీఆర్ఎస్ నేతల జోలికి వస్తే ఖబడ్డార్ కాంగ్రెస్ నాయకులారా హెచ్చరిస్తున్నానని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ నేతల అరాచకాలను భరిస్తే తాండూరు నియోజకవర్గం బీహార్, యూపీలాగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అరిస్థితి రాకూడదంటే నిర్ణయం మీ చేతుల్లోనే ఉందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రేపు తాండూరు పట్టణంలోని తన నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఏర్పాటు చేయడం జరిగిందని, అయ్యప్ప స్వాములు, పట్టణ ప్రముఖులు. నేతలు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్, తాండూరు మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి. యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, బసీరాబాద్ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్, నాయకులు మల్లారెడ్డి, శేఖర్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

