నగరేశ్వర దేవాలయ చైర్మన్‌గా కుంచెం మురళీ
– నియామకపత్రం అందజేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయ చైర్మన్‌గా కుంచెం మురళీ ఎన్నికయ్యారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పాలకవర్గం ఏర్పాటయ్యింది. ఆలయ చైర్మన్ గా కుంచెం మురళీ డైరెక్టర్లుగా కల్వ వీరేశం, ముదేళ్లి పురుషోత్తం, నెమలిగ నరహరి, పొకల నర్మదాలు నియామకమయ్యారు.
బుధవారం తాండూరు ఎమ్మెల్యే వి ఎలెట్ రోహిత్ రెడ్డి ఆలయ చైర్మన్ గా ఎన్నికైన కుంచెం మురళీకి నియామకపత్రం అందజేశారు. పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మరొ వైపు చైర్మన్ కుంచెం మురళీ, కమిటి డైరెక్టర్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, భద్రేశ్వరాలయ మాజీ చైర్మన్ బంటారం సుధాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కం వీరేందర్, టీఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి(రాజు) తదితరులు ఉన్నారు.

