గోనూర్‌లో హైనా హ‌డ‌ల్..!

క్రైం తాండూరు వికారాబాద్

గోనూర్‌లో హైనా హ‌డ‌ల్..!
– పొలాల్లో సంచ‌రిస్తున్న అడ‌వి జంతువు
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మండ‌లంలో ఎక్క‌డి నుంచో వ‌చ్చిన హైనా(అడ‌వి జంతువు) గ్రామ ప్ర‌జ‌ల‌ను హ‌డ‌లెత్తిస్తుంది. శుక్ర‌వారం ఈ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే తాండూరు మండ‌లం గోనూర్ గ్రామంలో స‌ర్పంచ్ కొల్లి గోవింద్ గ్రామ స‌మీపంలో మొక్క జొన్నను సాగుచేస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా పొలంలో వింత గుర్తులు ఉండ‌డంతో అనుమానాం వ్య‌క్తం చేశారు. అయితే పొలంలో ఎక్క‌డి నుంచో వ‌చ్చిన హైనా జంతువే గుర్తించారు. గ్రామ స‌మీపంలోని పొలాల్లో హైనా సంచారంపై గ్రామ‌స్తులు భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. విష‌యాన్ని తాండూరు ఫారెస్టు అధికారుల‌కు స‌మాచారం అందించారు. విష‌యం తెలుసుకున్న అధికారులు సంఘ‌ట‌నా స్థ‌లానికి ప‌రిశీలించారు. అయితే హైనా జంతువు సంచ‌రిస్తున్న ప్ర‌దేశానికి ఎవ్వ‌రు వెళ్ల‌వ‌ద్ద‌ని ఫారెస్టు అధికారి శ్యాంసుంద‌ర్ రావు సూచించారు. వీలైనంత త్వ‌ర‌గా హైనాను ప‌ట్టుకుని జూ కు త‌ర‌లిస్తామ‌ని తెలిపారు. మ‌రోవైపు గ్రామంలో గ‌తంలో కూడ అడ‌వి జంతువులు సంచ‌రించిన విష‌యాన్ని గ్రామ‌స్తులు గుర్తుచేస్తున్నారు. అడ‌వి జంతువుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులను కోరుతున్నారు.