6 నుంచి టీఆర్ఎస్ మహిళ బంధు సంబరాలు
– అదిరేలా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు
– ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో మంత్రి కేటీఆర్ సమావేశం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈనెల 6, 7,8 తేదీలలో ‘మహిళాబంధు’ పేరిట సంబరాలు నిర్వహిం చాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో మహిళబంధు పేరుతో సంబరాలకు సిద్దమయ్యింది. ఇందులో ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయబోతుంది. ఇందులో భాగంగా గురువారం మంత్రి కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హాయం, సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల అమలుతో 10 లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు, సుమారు 11 లక్షల మంది మహిళలకు కేసీఆర్ కిట్ పథకం అమలైందని అన్నారు. ఇంతటి ఘనమైన మహిళా సంక్షేమ మైలురాళ్లను చేరుకున్న నేపథ్యంలో, ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగిందన్నారు. మహిళ బంధు కార్యక్రమాలతో 6న మహిళలు సీఎం కేసీఆర్కి రాఖీ కట్టడం. పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు, తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం చేయడం, కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, థాంక్యూ కేసీఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటుచేయాలని కేటీఆర్ సూచించారు. 7న కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, ఇతర మహిళా సంక్షేమ పథకాల లబ్ధిదారు లను నేరుగా ఇంటి వద్దకెళ్లి కలవనున్నారు. లబ్ధిదా రులతో సెల్ఫీలు తీసుకోవడం. 8న నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

