శభాష్‌.. వినయ్‌..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

శభాష్‌.. వినయ్‌..!
– తాండూరు యువకుడి గిన్నిస్‌ రికార్డు
– అభినందించిన వీరశైవ సమాజం
తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్‌ వినయ్ కుమార్ అంటూ తాండూరు యువకుడిని వీరశైవ సమాజం సభ్యులు అభినందించారు.

తాండూరు పట్టణంలోని ప్రసిద్ద భద్రేశ్వర దేవాలయ పూజారి, వీరశైవ సమాజ సర్వ సభ్యులు మడపతి విజయకుమార్ స్వామి కుమారుడు వినయ్ కుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.

ఈనెల 13వ తేదీన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ విభాగంలో లదాక్ అనే సరిహద్దుల్లో వుమ్లింగ్ లా అనే ఎత్తయిన శిఖరం(ఎత్తు19024 ఫీట్లు) మైనస్ డిగ్రీ ఆక్సిజన్ లో ఎంతో కఠినాత్మకమైన శిఖరాన్ని అవరోధించాడు. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఈ మేరకు వినయ్‌ కుమార్‌కు రికార్డుకు సంబంధించిన అవార్డును అందజేశారు.

ఇందులో భాగంగా వీరశైవ సమాజం ఆధ్వర్యంలో వినయ్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ శభాష్‌ వినయ్‌ కుమార్‌ అంటూ అభినందించారు. అదేవిధంగా ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమాజం అధ్యక్షులు తంబాకు చంద్రశేఖర్, కార్యదర్శి బసవరాజ్, సభ్యులు గూలి పరమేశ్వర్, శెట్టి భాస్కర్, లింగదళి రవికుమార్, శశాంక్, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

తాండూరు ఆర్టీసీకి కొత్త డీపో మేనేజర్‌