నేటి నుంచి గురుకుల పాఠశాలల ప్రవేశానికి దరఖాస్తులు
– 5వ తరగతి విద్యార్థులకు అవకాశం
– మే 8న ప్రవేశ పరీక్ష
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమశాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, విద్యాశాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి విద్యార్థుల ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆశాఖ అధికారులు వెల్లడించారు. ఈనెల 28వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, రూ. 100ల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వచ్చే మే నెల 8వ తేదిన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. 2021 – 22 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులన్నారు. దరఖాస్తు సమయంలో వేరేవారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేస్తే సెక్షన్ 416 ఐపీసీ 1860 కింద క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఇతర సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 180042545678తో పాటు జిల్లా ప్రధానాచార్యులను ఫోన్‌లో సంప్రదించవచ్చన్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల కోసం http://tswreis.ac.in (లేదా) http://tresidential.cgg.gov.in (లేదా) http://tgtwgurukulam. telangana.gov.in (లేదా) http://miptbcwreis.telangana.gov.in (లేదా) http://tgcet.cgg.gov.inలను సందర్శించవచ్చని సూచించారు.

