జర్నలిస్టులందరికి బీమా సదుపాయం

తాండూరు రాజకీయం వికారాబాద్

జర్నలిస్టులందరికి బీమా సదుపాయం
– త్వరలోనే ప్రెస్‌ క్లబ్‌ ఏర్పాటుకు కృషి
– టీయూడబ్ల్యూజే-ఐజేయూ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్హులైన జర్నలిస్టులందరికి బీమా సదుపాయం కల్పించేందుకు దృష్టిసారించడం జరుగుతుందని టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డిలు అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని సాయి మేధా పాఠశాలలో టీయూడబ్ల్యూజే-ఐజేయూ డివిజన్ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, కార్యదర్శి రామకృష్ణల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్‌ మండలాల అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ జర్నలిస్టులకు తపాలా శాఖలో అమలవుతున్న బీమా పథకాన్ని నమోదు చేసేందుకు నిర్ణయించామన్నారు. ఈ పథకంతో జర్నలిస్టులు ఏదైనా ప్రమాదంకు గురైనా, మరణించినా రూ. 10 లక్షల వరకు బీమా వర్తిస్తుందన్నారు. ఇందుకోసం తాండూరు నియోజకవర్గంలో సమన్వయ కమిటిలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అర్హులైన జర్నలిస్టులు బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అదేవిధంగా తాండూరులో త్వరలో ప్రెస్ క్లబ్ నిర్మాణంతో పాటు తాత్కాళిక భవనాన్ని ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు.

యూనియన్లకు అతీతంగా…
అదేవిధంగా టీయూడబ్ల్యూజే-ఐజేయు తాండూరు డివిజన్ అధ్యక్షుడు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా పథకాన్ని అందిస్తామన్నారు.

తాండూర్ నియోజకవర్గంలో పనిచేస్తున్న ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానల్ లో పనిచేస్తున్న వారు కూడా అర్హులని తెలిపారు. సేవా భావంతో చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ స్వాగతిస్తూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సభ్యులు రాంచెందర్, మాజీ అధ్యక్షులు నర్సింలు, మాజీ కార్యదర్శి నరేందర్, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు శాంతుకుమార్, లక్ష్మణ్‌, వెంకట్రామ్ రెడ్డి, వెంకటేష్‌, సంగమేష్‌, మహేష్‌, రాంరెడ్డి, జావిద్, రఘుమారెడ్డి, విజయ్ కుమార్‌లు పాల్గొన్నారు.

సమన్వయ కమిటీ ఇదే..
తాండూరు టౌన్: మహేష్
యాలాల: జావిద్
బషీరాబాద్: శివకుమార్
పెద్దేముల్: పాండు
తాండూరు మండల్ : శాంతు

ఇదికూడా చదవండి…

ఐస్‌ యాపిల్‌ వేరీ నైస్..!