వాలీబాల్ పోటీలో విశ్వవేద విద్యార్థి విక్టరీ..!
– రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపిక
– అభినందించిన ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలలో తాండూరు విశ్వవేద హైస్కూల్ విద్యార్థి విక్టరీ నమోదు చేశారు.

జిల్లా స్థాయి పోటీ నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. పాఠశాలకు చెందిన జి. శ్రీధర్ అనే విద్యార్థి జిల్లా స్థాయిలో నిర్వహించిన వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. పోటీలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు. దీంతో శ్రీధర్‌ను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మాట్లాడుతూ విశ్వవేద పాఠశాల విద్యార్థి సీఎం కప్ పోటీలలో సత్తా చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని విద్యార్థిని శ్రీధర్‌ను అభినందించారు. విశ్వవేద పాఠశాలలో చదువుతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, క్రీడాస్ఫూర్తిని నింపేందుకు కృషి చేస్తుందని అన్నారు.


