ఖ‌బ‌డ్దార్ క‌మీష‌న‌ర్..!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

ఖ‌బ‌డ్దార్ క‌మీష‌న‌ర్..!
– ఇంచార్జ్ క‌మీష‌న‌ర్‌పై చైర్ ప‌ర్స‌న్ ఫైర్
– కార్యాల‌యంలో రాజ‌కీయాలు చేస్తున్నారు
– మున్సిప‌ల్‌ను బ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారు
– ప్ర‌జ‌లకు ఇబ్బందులు క‌లిగిస్తే ఊరుకునేది లేదు
– వీడియోలో చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్, ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్ మ‌ద్య జ‌రుగుతున్న వివాదం మ‌రింత రాజుకుంది. శ‌నివారం ఓ వీడియోలో చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ ఇంచార్జ్ క‌మిష‌న‌ర్ అశోక్ కుమార్‌పై ఖ‌బ‌డ్దార్ అంటూ ఫైర్ అయ్యారు. కార్యాల‌యంలో రాజ‌కీయాలు చేస్తూ తాండూరును బ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ ప్ర‌స్తుత వేస‌విని దృష్టిలో ఉంచుకుని ప్ర‌జ‌ల‌కు తాగునీటి స‌మ‌స్య నియంత్ర‌ణ‌కు ప్ర‌ణాళిక‌లు, పంపుహౌస్ మ‌ర‌మ్మ‌త్తులు, మున్సిప‌ల్ వాహ‌నాలకు మ‌ర‌మ్మ‌త్తులు, కార్మికుల 11వ పీఆర్సీ, 18 మంది కార్మికుల ఉద్యోగాల‌తో పాటు తాండూరుకు వ‌చ్చే రాష్ట్ర మంత్రులు శ్రీ‌నివాస్ రెడ్డి, స‌బితారెడ్డిల‌కు స్వాగ‌త అంశాల‌తో ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని కోర‌డం జ‌రిగింద‌న్నారు. ఇందుకు కోసం ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్‌ను ఫోన్ ద్వారా కోరితే స్పందించ లేద‌ని ఆరోపించారు. ఈ విష‌యంపై వ్రాత‌పూర్వ‌కంగా ఇన్ వార్డులో నోటీసు అందించ‌డం జ‌రిగింద‌న్నారు. చైర్ ప‌ర్స‌న్ హోదాలో ఉన్న‌ప్ప‌టికి స్వ‌యంగా అందివాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. కార్యాల‌యంలో కార్య‌క‌లాపాల‌పై ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. చైర్ ప‌ర్స‌న్ విష‌యంలో ఎవ్వ‌రు స్పందించ‌రాద‌ని సిబ్బంది ఆదేశించార‌ని ఆరోపించారు. శ‌నివారం ఇంచార్జ్ కమీన‌ర్ త‌న చాంబ‌ర్‌లో ఉండ‌గా స్వ‌యంగా వెళ్లి స‌మావేశం ఏర్పాటుపై కోర‌డం జ‌రిగింద‌న్నారు. ఇందుకు ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ స‌రైన ప‌ద్ద‌తిలో స్పందించ‌లేద‌న్నారు. ఇలాంటి ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ వ‌ల్ల తాండూరు మున్సిప‌ల్ బ్ర‌ష్టుప‌ట్టింద‌న్నారు. ఎక్క‌డా లేని విధంగా ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు. ఆయ‌ప‌పై ఎలాంటి పోరాటానికి అయినా సిద్దంగా ఉన్నాన‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల విష‌యంలో ఇబ్బందుల‌కు గురిచేస్తే చూస్తూ ఊరుకునేద‌ని లేద‌ని, ఖ‌బ‌డ్దార్ క‌మీష‌న‌ర్ అంటూ హెచ్చ‌రించారు. ఈ వ్య‌వ‌హారం తాండూరులో రాజ‌కీయ దుమారానికి దారితీసింది.
https://youtu.be/Yjt-SpmPWBM