నామినేషన్ల జాబితా ఖరారు..!
– తాండూరులో 37 నామినేషన్లు
– చివరి రోజు ఎన్ని నామినేషన్లు అంటే
– వెల్లడించిన ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ల జాబితా ఖరారయ్యింది. చివరి రోజు అభ్యర్థుల నామినేషన్ల దాఖలుతో లెక్క తేలింది. ఈనెల 3నుంచి 10వ తేది వరకు తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి నామినేషన్ల దాఖలుకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. గడువు చివరి రోజు శుక్రవారం నామినేషన్లు జోరుగా దాఖలయ్యాయి. ఒక్కరోజే 16 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు.
చివరి రోజు బహుజన్ ముక్తి పార్టీ నుంచి నేనావత్ హరి నాయక్, బ్లూ ఇండియా పార్టీ నుంచి విఠల్, ప్రజా వెలుగు పార్టీ నుంచి గుడిసే గోపాల్, బీఆర్ఎస్ నుంచి రోహిత్ రెడ్డి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ధర్మపురం రాంచంద్రయ్య, యువ తులసీ పార్టీ నుంచి అనిల్ నోముల, బీ.రాములు, జనసేన పార్టీ నుంచి నేమూరి శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నుంచి బుయ్యని మనోహర్ రెడ్డి, నవ్ రంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవుటి శ్రీశైలం, స్వతంత్రులుగా బుయ్యని సత్యనారాయణ రెడ్డి, పి.రోహిత్ రెడ్డి, డి. మనోహర్ రెడ్డి, బొమ్మన బోయిన సుమంత్, అరవింద్ లు నామినేషన్లు వేసినట్లు తెలిపారు.
అయితే మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు మొత్తం 28 మంది అభ్యర్థులు 37 నామినేషన్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఇందులో కొందరు డబుల్ సెట్లు కూడా వేయడం జరిగిందని స్పష్టం చేశారు.
ఇదికూడా చదవండి…

