ఇంద్రారెడ్డి సేవలను చిరస్మరణీయం
– వర్దంతిలో నివాళులు అర్పించిన నాయకులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: పేదల హృదయాల్లో స్వర్గీయ మాజీ హోం మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పలువురు తాండూరు మండల నాయకులు అన్నారు. శుక్రవారం తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి 22వ వర్దంతిని ఘనంగా జరుపుకున్నారు. నరసింహారెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ తాండూరు మండల అధ్యక్షులు రాందాస్, ఉపాద్యాయులు నాగప్ప తదితరులు ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం స్వర్గీయ ఇంద్రారెడ్డి అహర్నిశలు కృషి చేశారని అన్నారు. తాండూరు ప్రాంతానికి, కోటబాస్పల్లి గ్రామానికి స్వర్గీయ ఇంద్రారెడ్డి ఎన్నో విధాల సేవ చేశారని కొనియాడారు. ఆయన చేసిన సేవలు ప్రజల మనస్సుల్లో గుర్తుండి పోతాయాన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్, మంగలి పాపయ్య, నరసయ్య, కురువ రాజు, వార్డు సభ్యులు భాస్కర్, నరసింహులు, ఛాకలి నరసింహులు, మల్కాప్ప, ఎండీ గౌసోద్దీన్, యూసుఫ్, ఎస్ఎంసి చైర్మన్ సురేష్, వడ్డే శ్రీనివాస్, అంజి,రాములు, అయ్యప్ప, చాకలి గోపాల్, ప్రభు, గ్రామస్తులు పాల్గొన్నారు.

