చందుమ‌హారాజ్ చిర‌స్మ‌ర‌ణీయుడు

తాండూరు రాజకీయం వికారాబాద్

చందుమ‌హారాజ్ చిర‌స్మ‌ర‌ణీయుడు
– తాండూరులో ఘ‌నంగా వ‌ర్దంతి
– నివాళులు అర్పించిన కుమారుడు, నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: స్వ‌ర్గీయ మాజీ మంత్రి చందుమ‌హ‌రాజ్ చిరస్మ‌ర‌ణీయుడు అని తాండూరు నేత‌లు కొనియాడారు. శ‌నివారం చందుమ‌హ‌రాజ్ వ‌ర్దంతిని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ప‌ట్ట‌ణంలోని విలియ‌మూన్ చౌర‌స్తాలో ఉన్న చందుమ‌హ‌రాజ్ విగ్ర‌హానికి ఆయ కుమారుడు ఎం.న‌రేష్ మ‌హారాజ్, కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు ప్ర‌భాక‌ర్ గౌడ్, షుకూర్, హేమంత్ కుమార్, బీసీ సంఘం నియోజ‌క‌వ‌ర్గ క‌న్విన‌ర్ కందుకూరి రాజ్ కుమార్ త‌దిత‌రులు కూడ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నాయ‌కులు మాట్లాడుతూ తాండూరు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి, పేద‌ల సంక్షేమానికి చందుమ‌హారాజ్ చేసిన సేవ‌ల‌ను గుర్తుచేసుకున్నారు. ఆయ‌న చేసిన సేవ‌ల‌తో ప్ర‌జ‌ల హృద‌యాల‌లో చిర‌స్మ‌ర‌ణీయుడుగా ఉంటార‌ని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ నాయ‌కులు, చందు మ‌హారాజ్ అభిమానులు త‌దిత‌రులు పాల్గొన్నారు.