బెదిరించినందుకే ఘోరం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బెదిరించినందుకే ఘోరం..!
– అన్నని కత్తితో నరికిన తమ్ముడు
– వీడిన తాండూరులో దారుణ హత్య మిస్టరీ
– పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వివరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మద్యం సేవించే సమయంలో చంపుతా అని చేసిన బెదిరింపుల గొడవ ప్రాణం తీసేందుకు దారి తీసింది. అన్న ప్రవర్తనతో విసుగు చెందిన తమ్ముడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం చెంగోల్‌ బస్తీలో చోటు చేసుకున్న వ్యక్తి దారుణ హత్య మిస్టరీ వీడింది. బుధవారం తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని చెంగోల్‌ బస్తికి చెందిన మదికంటి మాణెమ్మ కుమారులు సంతీష్ అలియాస్ సత్యం, రవిలు అన్నదమ్ములు. సతీష్ గతంలో సెల్‌ ఫోన్‌ షాపు నిర్వహించి.. ఆ తరువాత కూరగాయల వ్యాపారం చేసేవాడు. తమ్ముడు రవి కూడ సెల్‌ ఫోన్‌ డౌన్‌లోడింగ్‌ చేసేవాడు. సతీష్ లాక్‌ డౌన్ తరువాత నుంచి ఖాళీగా ఉంటూ మద్యంకు బానిస అయ్యాడు. తరచు గొడవలు జరుగుతుండడంతో సతీష్ భార్య అతనిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది.

సతీష్ ప్రవర్తన మార్చుకోకుండా తమ్ముడితో పాటు పలువురుతో గొడవలు పడుతుండే వాడు. గత ఆరు నెలల క్రితం కూడా సతీష్ రవితో గొడవ పడి కత్తితో దాడి చేశాడు. అప్పటి నుంచి అన్న సతీష్ ప్రవర్తనతో రవి విసుగు చెందేవాడు. మంగళవారం సతీష్‌, రవిలు చెంగోల్‌ బస్తిలోని ఇంట్లో ఇద్దరు మద్యం సేవించారు. ఈ క్రమంలో సతీష్, రవిలు మరోసారి గొడవ పడ్డారు. సతీష్ రవిని చంపుతా అని బెదిరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన రవి ఇంట్లో ఉన్న టెంకాయలు నరికే కత్తితో సతీష్‌ తలపై, ముఖంపై, శరీర భాగాలపై నరికేశాడు. రక్తపుమడుగులో సతీష్ కొట్టుమిట్టాడుతుండగానే రవి అక్కడి నుంచి పరారయ్యాడు. సమీప బందువు ద్వారా సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రవి పరారిలో ఉన్నట్లు, త్వరలోనే పట్టుకుని రిమాండుకు తరలిస్తామని సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.

ఇది కూడా చదవండి…
జోష్‌ పెంచిన మహేంద్రుడు..!
– తాండూరు అసెంబ్లీ పోరుపై క్లారీటి
– నిలిచేది నేనే గెలిచేది నేనే అంటూ ధీమా
– గుర్తు మారోచ్చిన నేతలకు గుణపాఠమే
https://dharshininews.com/17336
chaithany collage