హాండిల్ లాక్ లేని బైకులే టార్గెట్..!
– జల్సాలకు అలవాటు పడి చోరీలు
– పోలీసులకు అడ్డంగా దొరికిన దొంగలు
– నలుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు
– చోరీ చేసిన ఆరు బైకుల స్వాదీనం
– వివరాలు వెల్లడించిన తాండూరు డీఎస్పీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : హ్యాండిల్ లాక్ లేని బైకులను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగల ఆటకట్టించారు తాండూరు పోలీసులు. ఐదు బైకులను చోరీ చేసిన దొంగలు మరో బైకును చోరీ చేసి వాహనాల తనిఖీలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ముఠాలో మొత్తం నలుగురు నిందితులు ఉండగా ఇందులో ఇద్దరు మైనర్లు ఉండడం గమనార్హం. బుధవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ కాశినాథ్లతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు పట్టణంలోని గ్రీన్ సిటి కాలనీకి చెందిన అడిగొల్ల వంశీకృష్ణ గౌడ్ అలియాస్ అభినందన్(20), తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన బొడ్డె జస్వంత్ అలియాస్ జానీలు మరో ఇద్దరు మైనర్లతో కలిసి జల్సాల కోసం బైకు చోరీలకు పాల్పడ్డారు.

20 రోజుల క్షితం హైదరాబాద్ దిలుషుక్ నగర్ లో రెండు పల్సర్ బైకులు, 15 రోజుల క్రితం యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనారాయణ పూర్ చౌరస్తా వద్ద హీరో హోండా స్పెండర్, మిత్రా నగర్ లో రాయల్ ఎన్ఫీల్డ్, పది రోజుల క్రితం వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను చోరీ చేశారు. చోరీ చేసిన బైకులను వారి వారి ఇండ్ల ఉంచుకున్నారు.
ఎలా దొరికారంటే…?
తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తా సమీపంలోని మీనార్ టీ పాయింట్ వద్ద సోమవారం మధ్యాహ్నం తన బైకు పోయిందని బంటారం మండలం కల్కుంద గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణ తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పట్టణ ఎస్ఐ కాశినాథ్ విలియమూన్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇంతలో అక్కడికి బైకుపై వచ్చిన వంశీకృష్ణ గౌడ్, జస్వంత్లను బైకు కాగితాలను అడగగా చూపించలేకపోయారు. దీంతో వారిని విచారిచంగా చౌరస్తాలో బైకు దొంగించినట్లు ఒప్పుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని మరింత విచారింగా ఐదు బైకులను దొంగిలించినట్లు తెలిపారు. అయితే హ్యాండిల్ లాక్ లేని బైకులను మాత్రమే చోరీలు చేసినట్లు విచారణలో తేలింది.
ఇద్దరి నిందితులు రిమాండ్
నిందితుల నుంచి దొంగిలించిన ఆరు బైకులను స్వాదీనం చేసుకున్నట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. అయితే నలుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉండగా వారిని జువైనల్ హోమ్‌కు తరలిస్తామని చెప్పారు. వంశీకృష్ణ గౌడ్, జస్వంత్లను రిమాండుకు తరలిస్తామని తెలిపారు. మరోవైపు కేసు చేధనలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ కాశినాథ్, రాములు, హెడ్ కానిస్టేబుళ్లు రామకృష్ణ, అంజద్, కానిస్టేబుల్స్ శివకుమార్, సాయప్ప, షబ్బీల్లను అభినందించారు.
ఇదికూడా చదవండి…

