వింత మేక పిల్ల జననం

ఆరోగ్యం వికారాబాద్

వింత మేక పిల్ల జననం
– నుదుటిపై రెండు క‌ళ్లు ఒకేచోట‌
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లాలో వింత మేక‌పిల్ల జ‌న్మించింది. శనివారం జిల్లాలోని దౌల్తాబాద్ మండ‌లం బిచ్చాల గ్రామంలో ఈ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. గ్రామానికి చెందిన మేక‌ల పెంప‌కం దారునికి చెందిన ఓ మేక అరుధైన మేక పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. సాధారణంగా మేక పిల్ల‌కు రెండు క‌ళ్ల మ‌ద్య దూరం ఉండ‌డం స‌హ‌జం. కాని అరుదైన విధంగా ఈ మేక పిల్ల‌కు నుదుటిపై రెండు క‌ళ్లు ఒకే కంటిలో ఉండ‌డం విశేషం. ఈ విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు వింత మేక‌పిల్ల‌ను చూసేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించారు. అయితే జ‌న్యుప‌ర‌మైన లోపాల‌తో ఇలాంటి అరుదైన విధంగా జంతువులు జ‌న్మిస్తాయ‌ని ప‌శువైద్యాధికారులు పేర్కొంటున్నారు.