ధర్మాన్ని అందరు ఆచరించాలి
– ఆద్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
– 100వ మండల సమాప్తి అభినందనీయం
– శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ధర్మాన్ని అందరు ఆచరించాలని ఆధ్యాత్మిక గురువు, కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద సరస్వతి సామి అన్నారు. ఆదివారం తాండూరు శ్రీ గీతా సత్సంగ్ సమితి 13వ వార్షికోత్సవ ఉత్సవాలతో పాటు 100 మండల గీతాపారాయణ సమాప్తి ఉత్సవాలు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ ఉత్సవాలకు శ్రీపీఠం వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామి ప్రవచనాలను వినిపించారు. ధర్మ సందేశాన్ని ఉపదేశించారు. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని అనుసరించడమేనని, మన వేద విజ్ఞాన విలువలను పరిరక్షించుకుని భావితరాలకు అందివ్వాలని, జీవితంలో బంధాల విలువ తెలుసుకుని సుఖ దుఃఖ సమన్వయం చేసుకుంటూ ధర్మాచరణ గావించాలని ఉపదేశించారు. దీంతో పాటు తాండూరులో గీతా సత్సంగ్ సమితి సభ్యులు, భక్తులు 100 మండల పారాయణ సమాప్తి ఉత్సవాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పరమాత్మనందా స్వామి, బ్రాహ్మాచారి, వెంకట్ చరణ్, శంకరానంద స్వామి, గీతా సత్సంగ్ సమితి సభ్యులు, తాండూరు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కింది వరకు చూడండి…


