కుమార్ షాపింగ్‌మాల్‌లో లక్కీ డ్రా
– టీవీఎస్ బైకు గెలుచుకున్న యువకుడు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని అతిపెద్ద వస్త్ర దుకాణం కుమార్ షాపింగ్ మాల్లో లక్కీ డ్రా ఉత్సహాంగా కొనసాగింది. గత ఐదేళ్లుగా షాపింగ్ మాల్లో లక్కీ డ్రా కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఆదివారం ఏర్పాటు చేసిన లక్కీ డ్రా కార్యక్రమానికి ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డా.సతీష్ బాబు హాజరై డ్రా తీశారు. మొదటి బహుమతి కింద టీవీఎస్ బైకు, రెండో బహుమతిగా స్కూటీ, మూడో బహుమతిగా వాషింగ్ మిషన్, 4 నుంచి 9 బహుమతి కింద సైకిళ్లు, 10 నుంచి 19 బహుమతి కింద మిక్సర్ గ్రైండర్, 20 నుంచి 25వ బహుమతి వరకు రైస్ కుక్కర్, 26 నుంచి 50 వరకు డిన్నర్ సెట్లను ఉంచారు. ఇందులో మొదటి బహుమతి తాండూరు పట్టణానికి రాజు యాదవ్ అనే యువకుడికి టీవీఎస్ బైకు లభించింది. రెండో బహుమతి గోనూర్ గ్రామానికి చెందిన రవికుమార్‌కు లబించింది. ఈ సందర్భంగా సతీష్ బాబు మాట్లాడుతూ పట్టణ వాసులకు సౌకర్యంగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడమే కాకుండా ఐదేళ్లుగా లక్కిడ్రా నిర్వహిస్తూ ప్రజలను బహుమతులు అందించడం సంతోషకరమన్నారు. యజమాని రమేష్ మాట్లాడుతూ కస్టమర్ల అభిరుచి మేరకు వస్త్రాలను అందించడమే కాకుండా వారి ప్రయోజనాల కోసం లక్కీ డ్రా నిర్వహిస్తున్నామన్నారు.

