కూలీ ఇంటికి కష్టం
– వర్షంతో కూలిన ఇంటి పైకప్పు
– పరామర్శించిన షేక్ హసన్ పటేల్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే కూలి ఇంటికి పెద్దకష్టం వచ్చింది. భారీ వర్షాల కారణంగా ఇంటి పైకప్పు నట్టింట కూలిపడింది. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరుగలేదు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో నివాసం ఉంటు నందిగామ అనిల్ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత వారం రోజులుగా గ్రామంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి.
ఈ క్రమంలో బుధవారం ఇంటి పైకప్పు కూలి నట్టింట్లో పడింది. దీంతో ఇంట్లో ఉన్న నిత్యవసర సరుకులు, బట్టలు కిందపడిపోయాయి. అప్పటికి ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఉపసర్పంచ్, టీఆర్ఎస్ తాండూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్ సంఘటనా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. ఇంట్లో వస్తువులను ఖాళీ చేసి మరో ఇంట్లో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే సహాకారంతో బాధితులకు పరిహారం అందిలే చూస్తామని అన్నారు.



