వైకుంఠ ఏకాదశికి రండి..!
– చీఫ్ విప్ మ హేందర్ రెడ్డికి ఆహ్వానం
– 30న దస్తగిరిపేట్లో ఉత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 30న జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు రావాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డికి తాండూరు మండలం అంతారం గ్రామస్తులు, దేవాలయ కమిటి ప్రతినిధులు కోరారు.

గురువారం తాండూరు పట్టణంలోని చీఫ్ విప్ నివాసంలో మహేందర్ రెడ్డిని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 30న అంతారం అనుబంధ గ్రామం చంద్రగిరి(దస్తగిరిపేట్)లోని శ్రీ భూదేవి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

దేవాలయంలో భక్తులకు ఉత్తర ద్వారా దర్శన భాగ్యంతో పాటు ఆలయంలో స్వామి వార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. కావున వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు హాజరై స్వామిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంతారం మాజీ ఎంపీటీసీ శాంతు, దేవాలయ కమిటి సభ్యులు సుబ్బారావు, నాయకులు గడ్డలి రవిందర్, బిడ్కర్ రఘు, భగవాన్, సిద్దు అయ్యా, తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

