బీగ్ బాస్ – 5 సీజన్ ముహూర్తం ఫిక్స్
– సెప్టెంబర్ 5న ప్రారంభమంటూ ట్వీట్
దర్శిని ప్రతినిధి : బీగ్ బాస్ – 5 సీజన్ ప్రారంభించే ముహూర్తం అఫీషియల్ గా స్టార్ మా ప్రకటించింది. ఇప్పటికే . నాగార్జునతో ఒక ప్రోమో విడుదల చేసింది. ఈ షో సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ -5 ప్రారంభం కానున్నదని ట్వీట్ చేసారు.
ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్ లను కూడా దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షో లో పాల్గొనడానికి సెలెక్ట్ అయినవారు ఆగష్టు 26 నుండి క్వారెంటిన్ లో ఉంచడానికి అన్ని సిద్ధం చేసినట్లు వినికిడి. అక్కడ 15 రోజుల క్వారెంటిన్ తర్వాత సెప్టెంబర్ 5న కంటెస్టంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్. అయితే ఇప్పటికే సీజన్ 5 బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు పేర్లు అనేకమందివి వినిపిస్తున్నాయి. ఈసారి సీజన్ లో సందడి చేయడానికి యాంకర్ రవి, లోబో, సినిమా హీరోయిన్ ఇషా చావ్లా, నవ్య స్వామి, యూట్యూబ్ నిఖిల్, డాన్సర్ ఆనీ మాస్టర్, టిక్ టాక్ దుర్గారావు, జబర్దస్త్ వర్షిని, సీరియల్ ఆర్టిస్ట్ విజే సన్నీలు దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మరోపక్క రఘు మాస్టర్, సురేఖావాణి, సిరి హనుమంత్, యూట్యూబ్ ఫేమ్ షన్ముఖ్ జశ్వంత్ రాబోతున్నడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ వీరే సీజన్ 5 లో సందడి చేసే కంటెస్టెంట్ల పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

