‘మా’ ఎన్నికల తెరపైకి హీరో నాగార్జున
– ప్రకాశ్ రాజ్ అండ్ టీమ్ పకడ్బందీ ప్లాన్
దర్శిని ప్రతినిధి: తెలుగు నినీ పరిశ్రమకు సంబంధించి గత కొన్ని రోజులుగా ‘మా’ ఎన్నికలపై జోరుగా చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు పోటీపడేందుకు రెడీ అవుతున్నారు. రసవత్తరంగా జరిగే ఎన్నికలలో ఎవరి ఎత్తులు వారు వేసేందుకు సిద్దమవుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో వస్తున్న నాగ్ పుట్టినరోజు(ఆగస్ట్ 29)ను.. వీరు ఎన్నికల క్యాంపెయిన్‌గా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినవస్తుండటం విశేషం. ఆయన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ప్రకాశ్ రాజ్ అండ్ టీమ్ పకడ్బందీగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ ఆఫీసులో ఈ బర్త్‌డే వేడుకలను నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి నటుడు సమీర్ బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఆహ్వానాలు పంపినట్లుగా తాజాగా అందుతోన్న సమాచారం. అయితే ఈ ఇన్విటేషన్లు నాగార్జునకు తెలియకుండానే పంపినట్లుగా తెలుస్తోంది. నాగ్ పుట్టినరోజు వేడుక పేరుతో ఓటర్ల సమీకరణ చేయాలనేదే వ్యూహం అనేలా.. ఈ ఇన్విటేషన్లపై ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది. అంతేకాదు ఈ నెల 31న ‘మా’ అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ ప్రెస్ మీట్ కూడా పెట్టే యోచనలో ఉన్నట్లుగా సమాచారం.

