సబ్ కోర్టు ఏర్పాటుకు తోడ్పాటు
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– ఎమ్మెల్సీని కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో సబ్ కోర్టు ఏర్పాటు కోసం తమవంతు తోడ్పాటు అందిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో తాండూరు మున్సిఫ్ కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం వారు తాండూరులో సబ్ కోర్టుతో పాటు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపించాలని ఎమ్మెల్సీని కోరారు. ఇందుకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పందిస్తూ సబ్ కోర్టు ఏర్పాటు కోసం తప్పకుండా తోడ్పాటు అందిస్తామని హామి ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల దృష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మఠం చంద్ర శేఖర్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, కోశాధికారి సుదర్శన్, న్యాయవాదులు వెంకటేశ్వర్లు, మస్తాన్, టీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.


