తోబుట్టువుల ఆప్యాయతకు మారుపేరు రక్షా బంధన్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

తోబుట్టువుల ఆప్యాయతకు మారుపేరు రక్షా బంధన్‌
– తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– సోదరుడికి రాఖీ కట్టిన విఠల్ నాయక్ సోదరి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తోబుట్టువుల ఆప్యాయత, జీవితాంతం తరిగిపోని అనుబంధానికి మారుపేరైన రక్షాబంధన్‌ నిలుస్తోందని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు.

శనివారం రాఖీ పౌర్ణమి సందర్బంగా ఆయన నివాసంలో రక్షా బంధన్ జోష్ నిండుకుంది. ఈ సందర్బంగా విఠల్‌ నాయక్‌కు ఆయన సోదరి రుక్కిబాయి రాఖీ కట్టింది. అదేవిధంగా నాయక్ సోదరి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్లు లాంటి తోబుట్టువుల అనురాలకు రాఖీ పండగ మారు పేరుగా నిలుస్తోందని అన్నారు. ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ భరోసానిచ్చే సంప్రదాయాన్ని రాఖీ పండగ చాటి చెబుతుందన్నారు. రాఖీ పండగ అందరి ఇళ్లల్లో సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విఠల్ నాయక్ సతీమణి కిష్టమ్మ ఉన్నారు.

kvcs

ఇదికూడా చదవండి…

బీరప్ప దేవాలయానికి చేయూతనందిస్తా