పాన్, ఆధార్ లింకుకు ఇవ్వాలే లాస్ట్‌ డేట్‌

జాతీయం తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

పాన్, ఆధార్ లింకుకు ఇవ్వాలే లాస్ట్‌ డేట్‌
– త‌ర్వాత చేస్తే జ‌రిమానాలు త‌ప్ప‌వు
హైదారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: పాన్ కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేసుకునేందుకు నేడే లాస్ట్ డేట్. గ‌డువులోగా అనుసంధానం చేసుకుంటే రూ. 10 వేలు ఆధా చేసుకున్న‌ట్లే. త‌రువాత చేసుకుంటే జ‌రిమాన‌లు త‌ప్ప‌వు. ఆధార్‌తో లింక్‌ చేయడం అనేది గత ఏడాది 30 సెప్టెంబర్‌ వరకు గడువు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం దానిని 2022 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ గడువులోగా పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేయకుండా పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకోలేని వారు ఈ నెలాఖరులోగా ఈ పని పూర్తి చేసుకోవడం మంచిది. పాన్‌కార్డు ద్వారా ఎవరు ఎటువంటి లావాదేవీలు చేస్తున్నారో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌(Income tax) అధికారుల వద్ద పూర్తి డేటా ఉంటుంది. కొందరు రెండు పాన్‌ కార్డులు తీసుకుని మిస్‌ యూజ్‌ చేస్తుంటారు. ఇలా రెండు పాన్ కార్డులు తీసుకోవ‌డం అనేది చట్టరిత్యా నేరం. ఒకవేళ రెండు పాన్‌ కార్డులు ఉండి అధికారులకు దొరికిపోయినట్లయితే రూ.10 వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది.

పాన్‌తో ఆధార్ అనుసంధానం ఇలా…

1. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ తెరవండి.

2. మొదటిసారి లాగిన్ అయ్యే వారు రిజిస్టర్ చేసుకోవాలి. మీ పాన్ నెంబరే(శాశ్వత ఖాతా సంఖ్య) మీ యూజర్ ఐడీ అవుతుంది.

3. యూజర్ ఐడీ, పాస్వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.

4. ఆధార్‌, పాన్‌ లింక్ కోసం ఒక పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది.

5. పాన్ కార్డులోని వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ వంటి సమాచారం కనిపిస్తుంది.

6. స్క్రీన్ పై కనిపిస్తున్న పాన్ కార్డు వివరాలను ఆధార్లో పేర్కొన్న వివరాలతో ధ్రువీకరించుకోవాలి. ఒకవేళ వివరాలలో ఏమైనా తేడాలు ఉంటే రెండింటిలో ఒకే విధంగా ఉండేలా సరి చేసుకోవాలి.

7. వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి లింక్ నౌ బటన్ పై క్లిక్ చేయండి.

8. మీ ఆధార్, పాన్‌తో విజయవంతంగా లింక్ అయినట్లు పాప్-అప్ విండోతో సందేశం వస్తుంది.

9. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీలో కనిపిస్తున్న లింక్ ఆధార్ పై క్లిక్ చేయడం ద్వారా కూడా నేరుగా అనుసంధానించవచ్చు.

10. https://www.utiitsl.com/ వెబ్ సైట్ ద్వారా కూడా ఆధార్, పాన్‌ల‌ను లింక్ చేసుకోవచ్చు.