గ్రామాల ప్రగతి ప్రభుత్వ ధ్యేయం.!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రామాల ప్రగతి ప్రభుత్వ ధ్యేయం.!
– పల్లెల్లో పరిశుభ్రత పాటించాలి
– ఎంపీపీ అనితా గౌడ్, జెడ్పీటీసీ గౌడి మంజుల
– జోరుగా పల్లె ప్రగతి కార్యక్రమాలు
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : గ్రామాల ప్రగతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తాండూరు ఎంపీపీ అనితా గౌడ్, జెడ్పీటీసీ గౌడి మంజుల, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు పేర్కొన్నారు. ఆదివారం తాండూరు మండలంలో ఐదో విడత పల్లె ప్రగతి మూడో రోజు కొనసాగింది. మండలంలోని చింతామణిపట్నంలో కొనసాగిన కార్యక్రమంలో ఎంపీపీ అనితా గౌడ్, జెడ్పీటీసీ గౌడి మయిలు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవిందర్ గౌడ్, వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డిలు గ్రామ సర్పంచ్ తో కలిసి పారిశుధ్య పనులు చేపట్టారు.
అదేవిధంగా మండలంలోని గౌతాపూర్ లో సర్పంచ్ రాజప్ప గౌడ్, సంగంకలాన్‌లో సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, మల్కాపూర్‌లో సర్పంచ్ విజయలక్ష్మీ పండరి, కోటబాస్పల్లిలో సర్పంచ్ నాగార్జున, కొత్లాపూర్‌లో సర్పంచ్ సాయిలు, ఐనెల్లిలో సర్పంచ్ స్వప్న జ్యోతి, చెంగోల్ లో మల్లీశ్వరి, సంకి రెడ్డిపల్లిలో సర్పంచ్ అమృత్ రెడ్డి, కరణ్ కోట్ సర్పంచ్ వీణ హేమంత్, జినుగుర్తిలో సర్పంచ్ పట్లోళ్ల రత్నమ్మ, అల్లాపూర్లో సర్పంచ్ నందిని యాదయ్య గౌడ్, ఎల్మకన్నె, చంద్రవంచ, చిట్టిగణాపూర్, చెన్గేష్ పూర్ తదితర గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు పాల్గొని పల్లె ప్రగతిని ఉత్సహాంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం వచ్చదని వెల్లివిరాయాలన్నారు. పల్లెల అభివృద్ధి కోసమే ప్రభుత్వం పల్లె ప్రగతిని చేపడుతుందని, ఇందులో అందరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.