రోడ్డుపై గుంతలు పూడ్చిన కౌన్సిలర్
-శివాజీ చౌక్ రోడ్డుకు శాశ్విత పరిష్కారం చూపించాలి
-కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్‌గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వర్షం కారణంగా రోడ్డుపై ఏర్పడ్డ గుంతలకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్‌గౌడ్ తాత్కాళిక మరమ్మత్తులు చేయించారు. పట్టణంలోని శివాజీ – మల్‌రెడ్డిపల్లి రోడ్డు పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. తాజాగా కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్డుపై గోతులు ఏర్పడి మరింత దారుణంగా తయారైంది. గోతులు పూడ్చాలని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన స్పందించడం లేదని కౌన్సిరల్ ప్రభాకర్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం తన సొంత నిధులతో ట్రాక్టర్ ట్వారా కంకర వేయించారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో మట్టి వేసి తాత్కాళిక మరమ్మత్తులు చేయించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ శివాజీ చౌక్ రోడ్డుకు నిధులు మంజూరు చేయించి శాశ్విత పరిష్కారం చేయించాలని కోరారు.
