హ్యాపీ బర్త్ డే రోహిత్..!
– విషెస్ చెప్పిన మంత్రులు కేటీఆర్, సబితా రెడ్డి
– ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: హ్యాపీ బర్త్ డే రోహిత్ రెడ్డి అంటూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిలు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్, మంత్రి సబితారెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా ఎంపీ రంజిత్ రెడ్డిలను కూడ కలిసి రోహిత్ రెడ్డి వారి ఆశీర్వాదాలు
తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే’ రోహిత్ రెడ్డిని సన్మానించి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. అనంతరం మొక్కను బహుకరించారు. మరోవైపు మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులు కూడ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.



