బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పించండి
– మంత్రి కేటీఆర్ తో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– మంత్రి కేటీఆర్ ను కలిసిన చైర్ పర్సన్ కుటుంబం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీలో తమకు సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో
తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కోరారు. గురువారం రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిల సమక్షంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, బీఆర్ఎస్ నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు అభివృద్ధికి సహకరించాలని కోరారు.
అదేవిధంగా పార్టీలో సముచిత స్థానం కల్పించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. ఇందుకు కేటీఆర్ స్పందిస్తూ పార్టీలో సముచిత స్థానంతో పాటు మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామి ఇచ్చినట్లు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తెలిపారు. హామీ ఇవ్వడం పట్ల కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి…

