వీధి కుక్క‌ల వీరంగం..!

క్రైం తాండూరు వికారాబాద్

వీధి కుక్క‌ల వీరంగం..!
– ఇద్ద‌రు చిన్నారుల‌పై దాడి
– మ‌ల్‌రెడ్డి ప‌ల్లిలో ఘ‌ట‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వీధి కుక్క‌లు వీరంగం సృష్టించాయి. ఆడుకుంటున్న చిన్నారుల‌పై విరుచుకుప‌డి దాడి చేశాయి. దీంతో న‌లుగురు చిన్నారులు గాయాల‌పాల‌య్యారు. అక‌స్మాత్తుగా జ‌రిగిన ప‌రిణామంతో స్థానికులు ఆందోళ‌న చెందిన ఈ సంఘ‌ట‌న తాండూరు ప‌ట్ట‌ణం మ‌ల్‌రెడ్డిప‌ల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. మ‌ల్‌రెడ్డిప‌ల్లిలోని హ‌నుమాన్ ఫంక్ష‌న్ హాల్ వ‌ద్ద ఓ బాలుడు న‌డుచుకుంటున్న వెళుతుంగా అక్క‌డే నాలుగు కుక్క‌లు ఒక్క‌సారిగా దాడిచేశాయి. అదేప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న స్థానికులు గ‌మ‌నించి దాడికి పాల్ప‌డుతున్న కుక్క‌ల‌ను చెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో మ‌రింత రెచ్చిపోయిన కుక్క‌లు విడిపించేందుకు వ‌చ్చిన వారిలో ఉన్న మ‌రో బాలుడిపై దాడికి య‌త్నించాయి. స్థానికులు వేగంగా కుక్కుల‌పై దాడి చేయ‌డంతో అవి అక్క‌డి నుంచి పారిపోయాయి. కుక్క‌ల దాడిలో గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దాడిలో మొద‌ట గాయ‌ప‌డిన బాలుడికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు హైద‌రాబాద్‌కు రిఫ‌ర్ చేశారు. ఈ మేర‌కు కుటుంభీకులు బాలున్ని హైద‌రాబాద్ త‌ర‌లించారు. వీధికుక్క‌ల దాడి సంఘ‌ట‌న స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసే కుక్క‌ల‌ను త‌ర‌లించాల‌ని కోరుతున్నారు.