‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

సినిమా

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ద‌ర్శిని ప్ర‌తినిధి: అక్కినేని వార‌సుడు అఖిల్ అక్కినేని.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే హిరో హిరోయిన్లుగా రూపొందుతున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కించిన‌ ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించాడు. జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. హర్ష అనే ఎన్ఆర్ఐ పాత్రలో అఖిల్, విభా అనే స్టాండర్డ్ కమెడియన్ పాత్రలో పూజా హెగ్డే కనిపించబోతున్నారు. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ వల్ల ఆగిపోయింది. ఇటీవల అన్నీ సినిమాల విడుదల తేదీలు ఖరారవుతున్న క్రమంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ కూడా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు. ఈషా రెబ్బ, మురళి శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాష్, ప్రగతి, ఆమని కీలకపాత్రల్లో నటిస్తున్నారు.